టిమ్ కుక్ యాపిల్ సీఈవోగా ఇంకా ఎన్నేళ్లు..! 17 d ago
టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీను టిమ్ కుక్ దాదాపుగా దశాబ్ద కాలానికి పైగా నడిపిస్తున్నారు. ఆయన ఇంకా ఎన్నాళ్లు ఆ పదవిలో కొనసాగుతారు అనే అంశాలపై తాజాగా, కుక్ స్పందించారు. వైర్డ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మెదడు ఇక చాలు అని చెప్పే వరకు తాను పనిచేస్తానన్నారు.యాపిల్ లేకుండా తన జీవితాన్ని ఊహించుకోవడం చాలా కష్టమని కుక్ పేర్కొన్నారు. 1998 నుంచి కంపెనీతోనే తన జీవితం ముడిపడి ఉందన్నారు.